Navy Day: నౌకా దళ సిబ్బందికి సీఎం అభినందనలు..! 18 d ago
నౌకా దళ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ నౌకా దళ సిబ్బందికి, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడుతున్న నౌకాదళ సిబ్బంది త్యాగం, వారి ధైర్యసాహసాలకు దేశం గర్విస్తుందని అన్నారు. దేశాన్ని రక్షిస్తూనే విపత్తు సమయాల్లో వారందించే సామాజిక సేవలు అజరామరమని ఒక సందేశంలో ఆయన పేర్కొన్నారు.